in

Rakshasa Raju to have rana and mohan lal?

తేజ దర్శకత్వంలో రానా కథానాయకుడిగా ‘నేనే రాజు – నేనే మంత్రి’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. హీరోగా ఈ సినిమా రానాకి హిట్ ఇచ్చింది. అలాగే చాలా కాలం తరువాత తేజకి కూడా ఆ సినిమా విజయాన్ని అందించింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘రాక్షసరాజు’ అనే సినిమా రూపొందనున్నట్టుగా వార్తలు వచ్చాయి. యాక్షన్ – ఎమోషన్ ప్రధానంగా నడిచే కథ ఇది..

ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా ఉంటాయని అంటున్నారు. ఇది ‘బావ – బావమరిది’ కథ అని తెలుస్తోంది. తన బావ అంటే ఆ బావమరిదికి ఎంతో అభిమానం..ఆయన మాట అంటే వేదం. అయన కోసం ఆ బావమరిది ఎంతదూరమైనా వెళతాడు. ఎంతకైనా తెగిస్తాడు. అలాంటి బావమరిది పాత్రను రానా పోషించనుండగా, బావ పాత్ర కోసం మోహన్ లాల్ ను సంప్రదిస్తున్నట్టుగా సమాచారం..!!

jyotika ends the divorce rumors with surya finally!

Vijay Deverakonda To Romance animal girl Tripti Dimri?