గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రాకేష్ మాస్టర్ హల్చల్ బాగా కనిపిస్తోన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ సెలబ్రిటీల పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఇండస్ట్రీ వర్గాల్లో పలు చర్చలకు కారణమవుతున్నాడు కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. ఆయన ఈ మధ్య ఇచ్చే ప్రతి ఇంటర్వ్యూలోనూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా రష్మీ గౌతమ్ పర్సనల్ లైఫ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి కొత్త అలజడి సృష్టించాడు. ఏకంగా ఆమె పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
తాను ‘ఢీ’ ప్రోగ్రాం చేస్తున్నప్పటి నుంచే రష్మీ తనకు తెలుసని, ఆమె గర్వం లేని మంచి మనిషని చెప్పాడు రాకేష్. తాను ఎక్కడ కలిసినా ఆప్యాయంగా పలకరిస్తుందని, తనకు బిడ్డ లాంటిదని ఆయన అన్నాడు. ఈ క్రమంలోనే పాపం రష్మీ గురించి ఓ విషయం చెప్పాలి అంటూ ఆమె కెరీర్ ఆరంభంలోనే ఓ సినిమా చేస్తున్నప్పుడు.. ఈ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆమెను బాగా ఇబ్బంది పెట్టారని అన్నాడు. దీంతో ఒకానొక సమయంలో రష్మీ.. ఇండస్ట్రీని వదిలి వెళ్లాలని డిసైడ్ అయిందని తెలిపాడు రాకేష్ మాస్టర్. అయితే ఆ సమయంలో ఈ విషయాన్ని బయటకు రాకుండా చూశారని, అందుకే ఇది ఎవ్వరికీ తెలియదని చెప్పి బాంబ్ పేల్చాడు రాకేష్.