
70 వ దశకంలో సూపర్ స్టార్ రజినీకాంత్ గారి కంటే శ్రీ దేవి గారే ఎక్కువ పారితోషికం తీసుకునేవారట. 1976 లో రజినీకాంత్, కమల్ హాసన్, శ్రీ దేవి కలిసి నటించిన చిత్రం ‘ముండ్రు ముడిచ్చు’ , కే బాలచందర్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాకు గాను రజనీకాంత్ గారు తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా..కేవలం 2000 రూపాయలట. కానీ శ్రీ దేవి గారు ఆ సినిమాకి తీసుకున్న పారితోషికం 5000 రూపాయలట. దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు మనం అలనాటి తార అతిలోక సుందరి శ్రీ దేవి గారిని అభిమానులు భారతదేశపు తొలి మహిళా సూపర్ స్టార్ అని ఎందుకు సంబోదిస్తారో.

