in

YUVATHAKI GOPPA PAATAM NERPINA NTR!

న ఇంటి తలుపు తట్టిన మొదటి సినిమా అవకాశాన్ని వద్దు అనుకున్న యెన్. టి. ఆర్. మనకు తెలుసు సినిమా అవకాశం కోసం హైదరాబాద్ చేరి, అవకాశాలు రాక, రాబడి లేక పస్తులతో పాట్లు పడుతూ, తిరిగి ఇంటికి రాలేక నలిగి పోతున్న జీవితాలు ఎన్నో. అటువంటి వారికీ కనువిప్పు ఈ సంఘటన. 1948 లో యెన్.టి.ఆర్. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజుల్లో, సి.పుల్లయ్య గారు నిర్మిస్తున్న వింధ్యరాణి చిత్రం లో నటించమని వారి దగ్గరనుంచి వచ్చిన పిలుపును తిరస్కరించారు. ఎందుకో తెలుసా సినిమా అనేది అనిశ్చితం అయినది అక్కడ అవకాశాలు రాక పోతే డిగ్రీ ఉంటె ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు, కాబట్టి డిగ్రీ పూర్తి చేసిన తరువాతే సినిమా అవకాశాల గురించి ఆలోచించాలి అనుకున్నారు యెన్.టి.ఆర్. స్వయంగా సి.పుల్లయ్య గారు విజయవాడ వచ్చి యెన్.టి.ఆర్. ను కన్వెన్స్ చేయటానికి ప్రయత్నించినా సున్నితం గ తిరస్కరించారు.తాను అనుకున్నట్లే డిగ్రీ పూర్తి చేసి, కొంత కాలం ప్రభుత్వ ఉద్యోగం చేసి 1949 లో మళ్ళి ప్రయత్నించి ,వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మనదేశం సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసారు. ఇది నేటి యువత కు ఒక గొప్ప పాఠం.విషన్ అండ్ ప్లానింగ్ ఉంటె జీవితం కుదుపులు లేని ప్రయాణం అవుతుంది అనే విషయం తెలియ చేస్తుంది.

Tollywood stars with health problems!

who is the sankranthi winner?