72 ఏళ్ల వయసున్న సూపర్ స్టార్ రజినీకాంత్, 51 సంవత్సరాల వయసున్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాళ్ళమీద పది మొక్కడం ఏంటని సాంఘీక మాధ్యమంలో వైరల్ అయింది. అయితే నిన్న ఈ సంఘటనపై రజినీకాంత్ స్పందించి, తనదైన రీతిలో తగిన సమాధానం ఇచ్చారు..లక్నోలో ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ని కలుసుకోవడానికి అతని ఇంటికి వెళ్ళినప్పుడు, రజినీకాంత్ ని రిసీవ్ చేసుకునేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బయటకి వచ్చారు, అప్పుడు వెంటనే రజినీకాంత్ అతని కాళ్ళను తాకడానికి వంగడం,
ఆదిత్యనాథ్ వెంటనే రజనీకాంత్ ని ఆలా వద్దని చెప్పేలోపే రజినీకాంత్ ఆయన పాదాలకు నమస్కారం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు రజినీకాంత్ తన పర్యటనలు అన్నీ ముగించుకొని నిన్న చెన్నై వచ్చారు. అక్కడ ఎయిర్ పోర్ట్ లో దిగగానే పత్రికా విలేకరులు అందరూ ఈ వైరల్ అయినా ప్రశ్ననే రజనీకాంత్ ని అడగటం జరిగింది. దీనికి రజినీకాంత్ తనదైన రీతిలో స్పందించారు. “ఎవరైనా స్వామీజీ కానీ యోగి కానీ నాకు ఎదురుపడితే వాళ్ళు నాకంటే చిన్నవారైనా వారి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకోవటం నా పద్ధతి,” అంటూ చెప్పి ఇక దానిమీద మరి చర్చ అనవసరం అన్నట్టుగా వెళ్లిపోయారు..!!