in

Rajinikanth Arrives In An Auto-Rickshaw For Dharman Shoot!

Keerthy Suresh’s Dorothy

సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన నిరాడంబరతను చాటుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘ధర్మన్’ చిత్ర షూటింగ్ నిమిత్తం మైసూర్‌లో ఉన్న ఆయన, సెట్‌కు ఏకంగా ఆటో రిక్షాలో చేరుకున్నాడు. ఈ అనూహ్య దృశ్యాన్ని చూసి అక్కడున్న అభిమానులు, చిత్ర బృందం ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి..

మైసూర్‌లో జరుగుతున్న ‘ధర్మన్’ సినిమా షూటింగ్ లొకేషన్‌కు రజనీకాంత్ ఆటోలో రావడం విశేషం. మెరూన్ రంగు చొక్కా, పంచె కట్టుకుని ఆటో దిగిన ఆయన, తన కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు వినమ్రంగా చేతులు జోడించి నమస్కరించాడు. అందరికీ అభివాదం చేస్తూ సెట్‌లోకి వెళ్లాడు. గేటు మూసివేస్తున్న సమయంలోనూ, బయట ‘తలైవా’ అంటూ నినాదాలు చేస్తున్న అభిమానుల కోసం ఆయన మరోసారి బయటకు వచ్చి వారిని పలకరించడం అందరినీ ఆకట్టుకుంది..!!

meenakshi chaudhary on board for nani’s Bloody Romeo?