యాక్షన్ సీన్స్ కోసం డూప్ ని పెట్టుకోవడానికి అస్సలు ఇష్టపడని హీరోస్ లొ ఒకరు మన ఆరడుగుల బుల్లెట్ గోపీచంద్ గారు, అందుకే ఆయన గారికి యాక్షన్ హీరో అనే టాగ్ లైన్ కూడా ఉంది. గోపీచంద్ గారు యాక్షన్ సన్నివేశాలు చేయడానికి చాలా ఇష్ట పడుతారు, కానీ ఆ ఇష్టమే ఆయనికి ఈమధ్య ఒక చేదు అనుభవాన్ని తెచ్చిపెట్టింది. కొన్ని నెలల క్రితం గోపీచంద్ షూటింగ్ లొ గాయపడి దాదాపు రెండు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్న విషయం వినే ఉంటారు, ఐతే షూటింగ్ లొ అక్కడ ఆయనకు తగిలిన గాయం కంటే ఆ ప్రాంతం ఆయనకు మిగిల్చిన చేదు అనుభవం ఎక్కువ బాధ పెట్టింది అనే చెప్పాలి.
ఇంక అసలు విషయంలోకి వెళ్తే, గోపీచంద్ నటిస్తున్న చాణక్య మూవీ షూటింగ్ రాజస్థాన్ లొ జరుగుతున్నపుడు అనుకోకుండా నెర్వ్స్ కట్ అయ్యి రక్తం బోలెడంత కారిపోయిందట. దానికి చికిత్స చేయడం కూడా ఆలస్యమైపోయింది. దాని వల్ల చాలా రక్తాన్ని కోల్పోవాల్సి వచ్చిందంట. జైపూర్ నగరానికి దాదాపు 3గం.ల ప్రయాణ దూరంలో ఆ లొకేషన్ ఉండడంతో ఆ పరిసరాల్లో ఆస్పత్రి అన్నదే అందుబాటులో లేకపోవడం వాళ్ళ మూడు గంటలు కారుతున్న రక్తం చెయ్యితో అలాగే ఆస్పత్రి కోసం ప్రయాణించడం తనకు పెద్ద సమస్యగా మారిందని తెలిపారు. బైక్ ఛేజ్ సీన్ తీస్తున్న సమయంలో యాక్సిడెంట్ అయ్యింది అని తన ముందు ఉన్న కెమెరాల్ని సేవ్ చేయాలని చూసి తాను గాయపడ్డానని ఇటీవలే ఒక వెబ్ పోర్టల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లొ తెలిపారు గోపీచంద్ .