in

Rajashekar and his daughter Shivani to team up for ‘Shekar’!

వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ బ్యానర్స్ పై జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరో రాజశేఖర్ హీరోగా “శేఖర్” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రాజశేఖర్ 91 వ మూవీ గా తెరకెక్కుతున్న “శేఖర్ “మూవీ లో ఆయన పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. వెండితెరపై తండ్రి తనయ కలిసి కనిపించబోతున్న మొదటి చిత్రమిదే.

ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం రాజశేఖర్, శివానీ రాజశేఖర్ స్టిల్స్ విడుదల చేసింది. దర్శకురాలు జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. రాజశేఖర్, శివాని మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనీ , నిజ జీవితంలో ఎలా ఉంటారో సినిమాలో కూడా అలాగే ఉన్నారనీ , వారిద్దరూ చాలా సహజంగా నటించారనీ,  ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ఫస్ట్ గ్లింప్స్, లవ్ గంట మోగిందంటే పాటకు అద్భుత స్పందన లభించిందనీ , సినిమా కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందనీ , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ , త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తామనీ చెప్పారు.

Siddharth apologises to Saina Nehwal for ‘rude joke’ in open letter!

telugu girl ritu varma stills in blue dress!