రాజమౌళి ఒక సినిమా కు కొబ్బరి కాయ కొట్టారంటే, గుమ్మడి కాయ కొట్టేంతవరకు సినీ వర్గాలలో అదొక పెద్ద వార్తగా నిలుస్తుంది, ప్రేక్షకులలో ఉత్కంఠ పెంచుతుంది.ప్రేక్షకుల అంచనాలకు మించి చిత్రాలు నిర్మించి, ఒక్క అపజయం కూడా ఎరుగని విజేత రాజమౌళి. అటువంటి రాజమౌళి సినిమా షూటింగ్ ప్రారంభించిన పది రోజులకు ప్రాజెక్ట్ వైన్డ్ అప్ చేయాలనుకొన్నారు, కానీ కంటిన్యూ చేసి సూపర్ హిట్ కొట్టి “దట్ ఈజ్ రాజమౌళి” అనిపించుకున్నారు, అది ఏ సినిమా? ఏమిటా కధ? హీరోలతో సంబంధం లేకుండా కధనే హీరో గ నమ్ముకొని చిత్రాలు చేసే రాజమౌళి, తన తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ చెప్పిన రివెంజ్ స్టోరీ..
అంటే ఒక మనిషి చనిపోయి, తిరిగి , ఈగగా పుట్టి పగ సాధించే కధ, అయన జోక్ గ చెప్పిన కథను జక్కన్న సీరియస్ గ తీసుకున్నారు. నాని ని హీరో గ పెట్టి , ఈ రివెంజ్ స్టోరీ ని పట్టాలు ఎక్కించేసారు. ఇక ఈగ తో సినిమా అంటే కంప్లీట్ గ గ్రాఫిక్స్ మీద ఆధారపడవల్సిందే, సినిమా షూటింగ్ ప్రారంభించి పది రోజులు అయింది అయితే ముక్త వాళ్ళు అందించిన వి.ఎఫ్.ఎక్స్. జక్కన్న కు నచ్చ లేదు. దానితో విసుగు పుట్టి ప్రాజెక్ట్ వైన్డ్ అప్ చేయాలి అనుకున్నారట. ఆ తరువాత మళ్ళీ మనసు మార్చుకొని మెరుగైన వి.ఎఫ్.ఎక్స్. వర్క్ తో చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం తెలుగు కంటే ఇతర భాషలలో విజయం సాధించింది..