in

rajamouli left hyderabad city!

ప్రస్తుతం వేరే రాష్ట్రాల ప్రజలంతా హైదరాబాద్ ని వీడుతున్నారు. హైదెరాబాదులో కరోనా కేసులు ఎక్కువగా ఉండడం, అనేక ప్రాంతాలు హై రిస్క్ జోన్స్ గా ప్రకటించడం, అలాగే లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన వారు.. వర్క్ ఫ్రొం హోమ్ అంటూ చాలామంది హైదరాబాద్ ని వదిలి సొంతూళ్లకు వెళ్లిపోయారు. తాజాగా టాప్ డైరెక్టర్ రాజమౌళి కూడా RRR పనులు అన్ని పక్కనబెట్టి హైదరాబాద్ ని వదిలిపెట్టినట్టుగా తెలుస్తుంది.

బాహుబలి టైం లో ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న ఫామ్ హౌస్ కి రాజమౌళి షిఫ్ట్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. రాజమౌళి నల్గొండ జిల్లా నార్కట్ పల్లికి సమీపంలోని ఎదులూరు గ్రామంలో. పొలంలో తనకి నచ్చినట్టుగా విశాలమైన ఫాంహౌస్‌ను కట్టుకున్నాడు. కరోనా లాక్ డౌన్ తో షూటింగ్స్ అన్ని వాయిదా పడడం, ప్రస్తుతం హైదరాబాదులో ఉండడం అంత సేఫ్ కాదనుకున్న రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి ఫామ్ హౌస్ కి షిఫ్ట్ అవడమే కాదు.. రాజమౌళి అక్కడ వ్యవసాయం కూడా చేయబోతున్నాడట.

f cube ‘Raashi Khanna’!

mehreen saying goodbye to tollywood?