in

rajamouli: eega was the biggest experiment of my life

Keerthy Suresh’s Dorothy

రాజమౌళి కెరీర్‌లో ‘బాహుబలి’కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాతో ఆయన పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించగా, ‘ఆర్ఆర్ఆర్‌’తో అంతర్జాతీయ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అయితే తనకు అత్యంత సంతృప్తినిచ్చిన సినిమా మాత్రం ‘బాహుబలి’ కాదని రాజమౌళి వెల్లడించారు. తనలో నిజమైన ఆత్మవిశ్వాసాన్ని నింపిన చిత్రం ‘ఈగ’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబుతో కలిసి రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది..

ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ మీడియా ఛానల్‌తో మాట్లాడిన ఆయన తన సినీ ప్రయాణానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ప్రేక్షకులు తన కెరీర్‌ను ‘బాహుబలి’కి ముందు, తర్వాత అని విభజించి చూస్తారని, కానీ తన దృష్టిలో మాత్రం ‘ఈగ’కు ముందు, తర్వాత అనే విభజన ఉంటుందని తెలిపారు. ‘ఈగ’ తన కెరీర్‌లో చేసిన అతిపెద్ద ప్రయోగమని రాజమౌళి చెప్పారు. ఒక ఈగను ప్రధాన పాత్రగా తీసుకుని, దాని చుట్టూ భావోద్వేగాలతో కూడిన కథను నడిపించడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవమని వివరించారు..!!

Swetha Naidu enters the Bigg Boss house as wild card entry!

happy birthday pooja hegde!