in

happy birthday pooja hegde!

ప్రస్తుతం పూజా హెగ్డే..పేరుకు ఎంత క్రేజ్ వుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అక్టోబర్ 13న ఈమె పుట్టినరోజు. అయితే పూజా హెగ్డే..నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ..ఇక ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. అయితే ప్రస్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్‌గా నిలిచిన పూజా హెగ్డే ఈ ఏడాది బీస్ట్, రాధేశ్యామ్, ఆచార్య సినిమాలతో సందడి చేసింది.ఈమె తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే. అయితే పూజా హెగ్డే మాతృభాష తులు అయితే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కొద్దిగా కన్నడ, తమిళ్ కూడా మాట్లాడగలదు. పూజా మిస్ ఇండియా పోటీలలో 2009 లో పాల్గొన్నా మొదటి రౌండ్స్ లోనే ఎలిమినేట్ అయిపోయింది.

అయితే 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ బ్యూటీ బరువు 53 కేజీలు మరియు ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, టెన్నిస్ స్టార్ రోజెర్ ఫెదరర్ ను ఆరాధించే పూజా ఏ ఆర్ రెహ్మాన్ సంగీతానికి, జెన్నిఫర్ లోపెజ్ పాటలకు పిచ్చ ఫ్యాన్. ఇంకా హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ సినిమా పరంగా ఎక్కువగా ఇష్టపడుతుంది..ఇక ‘ఒక లైలా కోసం’ నుంచి రీసెంట్ ‘కిసి కా భాయ్, కిస్ కా జాన్ ’ వరకు సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ సాధించింది..ఫ్యూచర్ లో మరిన్ని మంచి రోల్స్ చేసి మనల్ని అలరించాలని కోరుకుంటూ..హ్యాపీ బర్త్డే టు ఔర్ బుట్ట బొమ్మ..!!

Rashmika Mandanna turns blind for animal?

runtime problems for Tiger Nageswara Rao?