in

Rajamouli Begins Shooting with Mahesh Babu and John Abraham?

సీక్రెట్ గ షూటింగ్ కానిస్తున్న రాజమౌళి
మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఇద్దరు కాంబినేషన్‌లో సినిమా వస్తుందని తప్ప..ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటకు రాలేదు. మూవీ యూనిట్ అధికారికంగా ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. ఇటీవల మూవీ ఓపెనింగ్ జరిగినప్పటికీ అది కూడా సీక్రెట్ గానే పూర్తి చేశారు. దానికి సంబంధించిన ఒక్క ఫోటో కానీ, వీడియో కానీ బయటకు రాలేదు. కానీ నిత్యం ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త మాత్రం వైరల్ అవుతూనే ఉంది.

రామోజీ ఫిల్మ్ సిటీలో జాన్ అబ్రహం తో రాజమౌళి షూటింగ్
తాజా సమాచారం ప్రకారం..సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహంతో షూటింగ్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో జాన్ అబ్రహం కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడం తప్ప..చిత్ర బృందం సినిమాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతూ సోషల్ మీడియాలో మహేష్ బాబుకు, రాజమౌళికి ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు..!!

happy birthday namratha!

Sai pallavi angry with fans taking photos without permission!