in

pushpa director Sukumar to work with Shah Rukh Khan?

పుష్ప సిరీస్ తో బాలీవుడ్ లోనూ క్రేజ్ తెచ్చుకొన్నాడు సుకుమార్‌. త‌న నుంచి ఎలాంటి సినిమా వ‌స్తుందా? అని దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. మ‌రోవైపు బాలీవుడ్ స్టార్లు సైతం సుకుమార్‌తో ప‌ని చేయ‌డానికి ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనేప‌థ్యంలో సుకుమార్ కు బాలీవుడ్ బాద్ షా..షారుఖ్ నుంచి పిలుపు వ‌చ్చింద‌ని క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి..సుకుమార్ – షారుఖ్ క‌లిసి ఓ సినిమా చేస్తున్నారంటే దానిపై అంచ‌నాలు మామూలుగా ఉండ‌వు..

అయితే ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది? అనే విష‌యంపై క్లారిటీ రావాల్సివుంది. ‘పుష్ప 2’ త‌ర‌వాత సుకుమార్ రామ్ చ‌ర‌ణ్ కోసం ఓ క‌థ రెడీ చేసే ప‌నిలో ఉన్నాడు. బుచ్చిబాబు సినిమా పూర్త‌యిన వెంట‌నే చ‌ర‌ణ్‌తో సినిమా మొద‌లెడ‌తాడు సుకుమార్‌. ఈలోగా స్క్రిప్టు పూర్తి స్థాయిలో రెడీ చేస్తారు. ఆ త‌ర‌వాత ‘పుష్ప 3’ ఉంటుంది. ప్ర‌భాస్ తో కూడా సుకుమార్ ప‌ని చేస్తార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇవ‌న్నీ పూర్త‌య్యే స‌రికి క‌నీసం 4 ఏళ్లు ప‌డుతుంది. మ‌రి అప్ప‌టి వ‌ర‌కూ షారుఖ్ ఆగుతాడా? అనేది ప్ర‌శ్న‌..!!

“Kissik Girl” Sreeleela dating her new co-star Kartik Aaryan?

Telangana police filed an FIR against rana, vijay, prakash raj