నాలుగు రోజుల్లోనే 800 కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప2: ది రూల్‘ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ నాలుగో రోజే రూ. 800 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించినట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేశ్ బాల వెల్లడించారు. ఓపెనింగ్ వీకెండ్‌లో వరల్డ్‌వైడ్‌గా ఈ మూవీ కలెక్షన్లు రూ. 800కోట్లు (గ్రాస్) దాటినట్లు ఆయన ట్వీట్ చేశారు.
పుష్ప సినిమా ఆల్ టైమ్ బెస్ట్ రికార్డ్!
ఇక హిందీ వెర్షన్‌లో ఈ సినిమా వసూళ్ల పరంగా కుమ్మేస్తున్న విషయం తెలిసిందే. దీంతో మొదటి వారాంతంలోనే పుష్ప-2 కలెక్షన్లు రూ. 1000 కోట్లు దాటడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, శాక్‌నిల్క్ ప్రకారం ఆదివారం ఈ మూవీ మొత్తంగా రూ. 141.5 కోట్లు రాబట్టింది. ఇందులో హిందీ నుంచే ఏకంగా రూ. 85కోట్లు రావడం విశేషం. సో..పూర్తి రన్‌టైంలో ఈ సూపర్ సీక్వెల్ వసూళ్ల పరంగా మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది..!!