in

puri to team up with kgf star yash?

కేజీఎఫ్’ సినిమాతో ఇండియా వైజ్ పాపులారిటీ సంపాదించాడు కన్నడ హీరో యశ్.  ఇప్పుడు ఆ సినిమాకు సిక్వెల్ తెరకెక్కిస్తున్నారు.  అందులోనూ యశ్ హీరోగా నటిస్తున్నాడు. కేజీఎఫ్-2 తర్వాత యశ్ ఎవరితో సినిమా తీస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో చాలాంది దర్శకులు పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ లిస్ట్‌లో టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతోదంటూ టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది.

పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిట్) పేరుతో పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అది కంప్లీట్ అయ్యాక మరో పాన్ కథతో యశ్‌తో సినిమా తెరకెక్కించాలనుకుంటున్నారట. దీనిపై యశ్-పూరీ మధ్య కొంతకాలంగా చర్చలు నడిచినట్టు టాక్. వీరి కలయికలో సినిమా రానుందని ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే అసలు విషయం తెలుస్తోంది.

venkatesh to play lecturer role in his next!

Vijay Sethupathi withdraws from Muttiah Muralitharan biopic!