in

Priyanka Arul Mohan to play female lead in mahesh babu’s next?

గ్యాంగ్ లీడర్ సినిమాలో అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించిన ఈ బ్యూటీ శ్రీకారం సినిమాలో కాస్త గ్లామరస్ గానే కనిపిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగులోను ఒకటి రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టే పనిలో ప్రియాంక అరుళ్ మోహన్ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడి అదిరిపోయే ఆఫర్ దక్కిందని తెలుస్తుంది.

ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసిందంట ఈ బ్యూటీ. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలోనూ.. అటు ఫిలింనగర్ లోను జోరుగా చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సర్కారు వారిపాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాను తెరక్కించిన అనీల్ రావిపూడి మరో సారి మహేష్ ను డైరెక్ట్ చేయాలనీ చూస్తున్న విషయం తెలిసిందే.

sai chand gari peru venaka unna asalu rahasyam!

Jr NTR to host ‘Meelo Evaru Koteeswarudu’ season 5!