in

priyamani to play a pregnant lady in her next!

క్రితం ఏడాది కన్నడలో ‘యాక్ట్ 1978’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ .. యజ్ఞ శెట్టి ప్రధానమైన పాత్రను పోషించింది. మన్సో రే దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అక్కడ విశేషమైన ఆదరణ లభించింది. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. దాంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు.

ప్రియమణి కథానాయికగా ఆయన ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. గర్భవతి అయిన ఒక మహిళ ప్రభుత్వం నుంచి తనకి రావలసిన నష్టపరిహారం కోసం, ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోతుంది. చివరికి మానవ బాంబుగా మారి ఆఫీసుకు వెళ్లి, ఎవరూ బయటికి వెళ్లకుండా తలుపులు మూసేస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందనే మలుపులతో ఈ కథ ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. ఈ తరహా పాత్రలను ప్రియమణి బాగా చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

surekha vani’s daughter supritha slips her tongue about taking wine!

Nivetha Pethuraj finds cockroach in her food, complains to Swiggy!