in

priyamani roped in for ‘pushpa -2’?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్..‘పుష్ప’ చిత్రంతో ఐకాన్ స్టార్ ప్లస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ‘పుష్ప’ రాజ్ గా అల్లు అర్జున్ నటనకు ప్రేక్షక లోకం ఫిదా అయింది. ముఖ్యంగా హిందీ బెల్ట్ ప్రజానీకం…ఈ సినిమా చూసి సర్ ప్రైజ్ అయింది..బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ‘పుష్ప’ పిక్చర్ చూసి వావ్ అన్నారు. సుకుమార్-బన్నీలు వెండితెరపై మ్యాజిక్ చేశారని తెగ కొనియాడారు. ఇప్పటికీ ‘పుష్ప’ మేనియా ఇంకా కొనసా..గుతూనే ఉన్నది. ఈ క్రమంలోనే మేకర్స్ పుష్ప-2 కోసం ప్లాన్ చేసుకుంటున్నారు.

కాగా, తాజాగా ఈ సినిమాలో అనగా ‘పుష్ప’రాజ్ ..సీక్వెల్ లో.. ఎవరూ ఊహించని సర్ ప్రైజెస్ ను దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం..సీక్వెల్ లో ఓ పవర్ ఫుల్ రోల్ కోసం కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అలాగే.. విజయ్‌ సేతుపతికి జంట మరో హీరోయిన్‌ ను కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రియమణిని ఈ సినిమాలో సేతుపతి భార్యగా తీసుకుంటారని టాక్‌ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

happy birthday sonu sood!

can you guess the native places of these star comedians!