in

Priyamani Reacts To Why She Was Not Cast Opposite top heroes!

ప్రస్తుతం 1952 నుంచి 1962 మధ్యలో ఫూట్ బాల్ కోచ్​గా వ్యవహరించిన సయీద్ అబ్దుల్ రహీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మైదాన్ సినిమాలో అజయ్ దేవగణ్​తో కలిసి ముఖ్య పాత్ర పోషించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్​లో పాల్గొన్న ప్రియమణిని ఒక ఇంటర్వ్యూలో తమిళ, తెలుగు భాషల్లో టాప్ హీరోలతో మీరు నటించకపోవడానికి కారణం ఏంటనే ప్రశ్న ఎదురైంది.

అందుకు ప్రియమణి సమాధానం చెబుతూ – “ఆ ప్రశ్న నన్ను కాదు డైరెక్టర్స్​ను, నిర్మాతలను అడగాలి. నాకు కూడా అదే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ మీరు అడిగిన ప్రశ్నకు నా దగ్గర పూర్తి సమాధానం లేదు. అయితే కొంతమంది నేను స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తే వాళ్లను నేనే డామినేట్ చేస్తానని, హైలైట్ అవుతానని అంటుంటారు. కానీ ఇందులో నిజం లేదని నాకు తెలుసు. నేను ఈ విషయం మీద ఎవరిని తప్పు పట్టాలని అనుకోవడం లేదు. నేను చేసిన సినిమాలు, పాత్రలతో నాకు పూర్తిగా సంతృప్తి దొరికింది..అని అన్నారు.

Geethanjali Malli Vachindi

17 years for ‘dhee’!