in

Prabhas to shoot for ‘Salaar’ fight sequence in singareni!

ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌లో విజ‌య్ క‌ర‌గందూర్ ‘సలార్’ అనే ప్యాన్ ఇండియా మూవీని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ప్ర‌భాస్ జోడీగా చెన్నై బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్ గ నిన్ననే ఎంపికైంది..కాగా ‘సలార్’ లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం..

ఈ చిత్రాన్ని తెలంగాణలోని సింగ‌రేణి ప్రాంతంలో చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌. అది కూడా ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను చిత్రీక‌రిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప‌ది రోజుల పాటు సింగ‌రేణిలో చిత్రీక‌రించాల్సిన ‘సలార్’ షెడ్యూల్ కోసం భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నార‌ని టాక్‌. ప్ర‌భాస్‌ నాలుగు నెలల పాటు ‘సలార్’ కోసం డేట్స్‌ను కేటాయించాడట. మే చివరి నాటికంతా ‘సలార్’ షూటింగ్‌ను పూర్తి చేసేలా యూనిట్ ప్లాన్ చేసిందట.

acharya teaser!

taapsee pannu about her boyfriend Mathias Boe!