in

Prabhas to play a cop in director Sandeep Vanga’s ‘Spirit’!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయాడు డార్లింగ్.. ఈ మూవీతో సౌత్‏లోనే కాకుండా.. నార్త్ లోనూ ఫుల్ ఫాలోయింగ్ సంపాందించుకున్నాడు. ప్రభాస్‏తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రమే కాకుండా.. కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం ఈ హీరో చేస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం. ఇక డార్లింగ్ చేస్తోన్న సినిమాల ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా వెండితెరపై ప్రభాస్ కనిపించకపోవడంతో.. డార్లింగ్ తదుపరి సినిమాలపై ఎన్నో అంచనాలతో వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన రాధేశ్యామ్ ఈనెల 14న విడుదల కాబోతుంది.

ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్‏ను షేక్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఇవే కాకుండా.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్.. కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలు చేస్తున్నాడు. అలాగే మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇవే కాకుండా.. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయనున్నాడు.

Rakul Preet reacts to her and Jackky Bhagnani’s wedding rumours!

Actress Trisha Krishnan stills at ‘Mohini’ Movie Press Meet!