in

Prabhas part of Mission Impossible 7, Director Christopher responds!

మిష‌న్ ఇంపాజిబుల్ ప్రాంఛైజీలో వ‌చ్చిన సినిమాలు ప్రేక్ష‌కుల‌ను ఏ రేంజ్‌లో అల‌రించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. మిష‌న్ ఇంపాజిబుల్‌..రోగ్ నేష‌న్‌, మిష‌న్ ఇంపాజిబుల్ ఫాల్ అవుట్ చిత్రాల‌ను డైరెక్ట్ చేశారు క్రిస్టోఫ‌ర్ ఎంసీ క్వ‌ర్రీ , ప్ర‌స్తుతం మిష‌న్ ఇంపాజిబుల్ 7 పైనే త‌న ఫోక‌స్ అంతా పెట్టాడు. అయితే మిష‌న్ ఇంపాజిబుల్ 7లో ప్ర‌భాస్ ను తీసుకుంటున్న‌ట్టు వార్త‌లు ఊపందుకున్నాయి.

ప్ర‌భాస్ ఈ ప్రాజెక్టులో కీ రోల్ లో క‌నిపించ‌బోతున్నాడంటూ న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా..ఓ అభిమాని డైరెక్టుగా క్రిస్టోఫ‌ర్ నే క్లారిటీ ఇవ్వాల‌ని అడిగాడు. దీనిపై స్పందించిన క్రిస్టోఫ‌ర్ ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని తెలిపాడు. ప్రభాస్ చాలా టాలెంట్ క‌లిగిన వ్య‌క్తి. అయితే మేము ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న్ను క‌ల‌వ‌లేదని చెప్పాడు. మిష‌న్ ఇంపాజిబుల్ 7లో టామ్ క్రూయిజ్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. 2022 జులైలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది..

actress geethanjali pics in dating apps, files Complaint to cyber crime police!

spyder unna coffee thaagi suicide ki siddhamaina Kaikala Satyanarayana!