in

prabhas new plan for ‘aadhipurush’!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాణాలు ఎలా ప్రయోగించాలనే దానిపై ట్రైనింగ్ తీసుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా ఇంట్లోనే ఓ సెట్ వేసుకుని ఓ ట్రైనర్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన శిక్షణను త్వరలోనే ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ట్రైనింగ్ లో బాణాలు ప్రయోగించడం, ఇతర వాటిపై శిక్షణ తీసుకోనున్నారు ప్రభాస్. వచ్చే ఏడాది ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రారంభం కానుంది. బాహుబలి కోసం యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు డార్లింగ్.

ఇప్పుడు ఆది పురుష్ లోని కొన్ని కీలక యుద్ధ సన్నివేశాల కోసం విలువిద్య నేర్చుకోనున్నాడు. మంచి బాడీ ఫిట్‌నెస్ కోసం ట్రైనర్ సమక్షంలో వర్కౌట్స్ చేస్తున్నాడు. కరోనా వైరస్ కారణంగా..సినిమా షూటింగ్ లు గత కొన్ని నెలలుగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో నటులంతా..ఇంట్లోనే ఉండిపోయారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సినిమా షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభాస్ కూడా కొన్ని సినిమాలకు సైన్ చేశారు.

nivetha thomas about nani!

pooja hegde dual role in ‘ radhe shyam’?