in

Prabhas’ Instagram account missing, hacked or deactivated?

తాజాగా ఈ పాన్‌ ఇండియా హీరో ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని తెలుస్తోంది. ఇన్‌స్టాలో ప్రభాస్‌ అకౌంట్‌ కోసం చూస్తే.. ఈ పేజీ అందుబాటులో లేదు అని చూపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌ అకౌంట్‌ కోసం వెతికితే కనబడం లేదు. దాంతో..ఆయన అకౌంట్ హ్యాక్‌ అయ్యిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌ అకౌంట్‌ కోసం సెర్చ్‌ చేస్తే ఫ్యాన్‌ మేడ్‌ అకౌంట్స్‌ కనిపిస్తున్నాయి తప్ప..అఫీషియల్ అకౌంట్‌ మాత్రం కనిపించట్లేదు. హ్యాక్‌ అయ్యిన అకౌంట్‌ను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రభాస్‌ టీమ్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా జులై నెలలో ప్రభాస్‌ ఫేస్‌బుక్‌ ఖాతా కూడా హ్యాక్‌కు గురైన విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు ‘మనుషులు దురదృష్టంతులు’ అంటూ హ్యాకర్లు వీడియో షేర్‌ చేశారు. అది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆందోళన వ్యక్త చేశారు. అప్పుడు తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని ప్రభాస్‌ కూడా ప్రకటన చేశాడు. మరోసారి డార్లింగ్ హీరో ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్‌ అవ్వడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు..!!

‘Stop making adult films’, Ekta Kapoor’s bold reply!

happening beauty Sreeleela Is Anil Ravipudi’s Akka Koothuru!