in

Prabhas FB Account Hacked, Viral Video Posted!

సినీ నటుడు ప్రభాస్ సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఫేస్‌బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. గురువారం సాయంత్రం ఆయన ఖాతాలో ఓ వైరల్ వీడియో కనిపించింది. మనుషులు దురదృష్టవంతులు అనే క్యాప్షన్ తో వున్న ఈ వీడియోను అభిమానులు, ఇతర నెటిజన్లు చూశారు. ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతా హ్యాకింగ్ కు గురైనట్లుగా గుర్తించి, ట్వీట్లు చేశారు. రంగంలోకి దిగిన ప్రభాస్ సాంకేతిక టీమ్ సమస్యను పరిష్కరించింది. పదేళ్ల క్రితం ఫేస్ బుక్ ఖాతాను ఓపెన్ చేసిన ప్రభాస్ కు 24 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన మాత్రం కేవలం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని మాత్రమే ఫాలో అవుతున్నారు. తన సినిమా విశేషాలు, నటీనటులకు శుభాకాంక్షలు చెప్పడానికి ఈ సోషల్ మీడియా అనుసంధాన వేదికను ఉపయోగించుకుంటున్నారు..!!

Naga Chaitanya to romance Keerthy Suresh!

delhi beauty ketika sharma acted with 3 mega heroes!