తెలుగు చిత్రాలలో కమెడియన్స్ కరువు లేదు, గంభీరంగా కనిపించే యెన్.టి.ఆర్. సహితం కమెడియన్స్ తో చాలా చనువుగా ఉండే వారు, రేలంగి ని బావ అని పిలిచే వారు, పద్మనాభం నిర్మించిన చిత్రాలలో యెన్.టి.ఆర్. గారే హీరో, అల్ల్లు రామలింగయ్య తో మంచి సాన్నిహిత్యం ఉండేది, చలం యెన్.టి.ఆర్. ని నాన్న గారు అని పిలిచే వారు. ఈ క్రమంలో కమెడియన్ పొట్టి ప్రసాద్ ? ? ? ఎవరో గుర్తుకు రాలేదు కదూ, సాగర సంగమం చిత్రంలో నమస్కారమయ్యా, నమస్కారమయ్యా అంటూ కమల్ హాసన్ చుట్టూ తిరుగుతుంది ఒక పొట్టి శాల్తీ ఆయనే పొట్టి ప్రసాద్, అయన అసలు పేరు కవిపురపు ప్రసాద రావు పొట్టి ప్రసాద్ సెట్స్ లో ఉంటె అక్కడి వాతావరణం చాల ఆహ్లాదం గ ఉండేది, యెన్.టి.ఆర్. వంటి సీరియస్ మనిషి కూడా పొట్టి ప్రసాద్ ప్రాక్టికల్ జోక్స్ ని బాగా ఎంజాయ్ చేసే వారు. పొట్టి ప్రసాద్ యెన్.టి.ఆర్. డైరెక్షన్లో నిర్మిస్తున్న “చాణక్య చంద్రగుప్త” చిత్రంలో ఒక క్యారెక్టర్ చేస్తున్నారు..
ఆ పాత్ర భుజం మీద ఒక కండువా ఉంటుంది ఎప్పుడు. షాట్ గ్యాప్ లో ఆ కండువా ఎక్కడో పెట్టి మర్చిపోయారు ప్రసాద్, యెన్.టి.ఆర్. పిలుపుతో సెట్లోకి వచ్చిన ప్రసాద్ ని చూసి మీ భుజం మీద కండువా ఏది అని అడిగారట యెన్.టి.ఆర్. అయ్యో! మర్చిపోయాను అంటూ బయటకు వెళ్లి వెతికిన ప్రసాద్ కు ఆ కండువా కనిపించలేదు, అలాగే వచ్చిన ప్రసాద్ ని చూసి, ఇంత నిర్లక్ష్యం అయితే ఎలాగూ , కండువా ఏమయ్యింది అని గద్దించారట, మౌనంగా తలవంచుకున్న ప్రసాద్ ని చూసి ఏమిటి ఆలోచిస్తున్నారు అని అడిగిన యెన్.టి.ఆర్ ని చూసి ఏమి లేదు సార్ ఆ కండువా బదులు నేను కనపడకుండా పోయి ఉంటె ఎలా ఉండేది అని ఆలోచిస్తున్నాను అన్నారట భయం, భయంగా , ఆ సమాధానం విన్న యెన్.టి.ఆర్. ఫక్కున నవ్వేశారట, ఇంతలో ఎవరో కండువా తెచ్చి ఇవ్వటం తో షూటింగ్ కంటిన్యూ చేశారట..!!