జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో ఆయనను మాస్టర్ అని పిలవొద్దని పూనమ్ ట్వీట్ చేసింది. ఇదే సమయంలో త్రివిక్రమ్ గురించి స్పందిస్తూ… ఆయనపై తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో గతంలో ఫిర్యాదు చేశానని… అయితే, సినీ పెద్దలు తన ఫిర్యాదులు పట్టించుకోలేదని విమర్శించింది. తనను రాజకీయంగా అనేక ఇబ్బందులకు గురి చేశారని చెప్పింది. ఇప్పటికైనా సినీ పెద్దలు త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని వ్యాఖ్యానించింది.
పూనమ్ కౌర్ వ్యాఖ్యలపై ‘మా’ ఇంకా స్పందించకపోయినా… ఫిలిం ఛాంబర్ మాత్రం స్పందించింది. లైంగిక దాడుల కేసుల పరిష్కారానికి సంబంధించి ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్యానెల్ లో సభ్యుడిగా ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ… పూనమ్ కౌర్ ఎప్పుడు ఫిర్యాదు చేసిందో? ఎందుకు ఫిర్యాదు చేసిందో? ఫిలిం ఛాంబర్ కు తెలియదని అన్నారు. ఫిర్యాదు లేకుండా తాము ముందుకు వెళ్లలేమని స్పష్టం చేశారు..!!