రాధే శ్యామ్ తో ఓ భారీ ఫ్లాప్ మూటగట్టుకొంది పూజా హెగ్డే. ఆ తరవాత వచ్చిన బీస్ట్ అంతకంటే దారుణం. ఈ సినిమాతో తమిళంలో పాగా వేయాలనుకున్న పూజా హెగ్డే ఆశలకు బ్రేక్ పడినట్టైంది. ఇప్పుడు ఆచార్య వస్తోంది. ఈ సినిమాలో నీలాంబరి అనే ఓ కీలకమైన పాత్ర పోషించింది పూజా. ఆచార్య సినిమా అటూ ఇటూ అయితే… పూజా పై ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అది .. పూజా కెరీర్ పై ఎఫెక్ట్ చూపించడం కూడా గ్యారెంటీ అనిపిస్తోంది. అందుకే ఆచార్య.. రిజల్ట్ ఏమవుతుందా? అనే టెన్షన్‌లో పూజా ఉందని సమాచారం.
పూజా కెరీర్ ఫ్లాపులతోనే మొదలైంది. వరుసగా మూడు ఫ్లాపులతో ఐరెన్‌లెగ్ అనిపించుకుంది. అయితే ఆ తరవాత దశ మారింది. ఒకదానికి మించి మరో సినిమా హిట్టవుతూ పోవడంతో… పూజా గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. పూజా ఉంటే చాలు.. సినిమా హిట్టు అనే స్థాయికి ఎదిగింది. ఒక్కో సినిమాకీ రూ.3.5 కోట్ల పారితోషికం అందుకునే స్థితికి చేరుకుంది. అయితే ఇప్పుడు మెల్లమెల్లగా ఆ అంచనాలు రివర్స్ అవుతున్నాయి. ఆచార్య హిట్టయితే.. పూజా ఊపిరి పీల్చుకోవచ్చు. లేదంటే కష్టమే..