in

Raveena Tandon, nora fatehi special roles in Pawan Kalyan’s next?

రీశ్​ శంకర్​ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్​కల్యాణ్​ నటిస్తున్న సినిమా ‘భవదీయుడు భగత్​ సింగ్’. తాజాగా ఈ చిత్రంలో బాలీవుడ్ భామ నటించనున్నట్లు నెట్టింట వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఇటీవల ‘కేజీఎఫ్​ 2’ సినిమాతో మంచి గుర్తింపు  తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్​ ను పవన్ సినిమాలో ఓ కీలకపాత్ర అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మూవీ చేయడానికి ఆమె పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ కు జోడీగా పూజా హెగ్డే నటించనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది..పవన్ కల్యాణ్ ఇతర సినిమాల విషయానికొస్తే.. పవర్ స్టార్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ చిత్ర షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాకు స్టార్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా తెరెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది పాన్ ఇండియా సినిమాకు రూపొందుతుంది.

భారీ బడ్జెట్ తో ఐదు భాషలలో ఈ సినిమాను ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. మెుగలుల కాలం నాటి కథతో ఈ తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ వజ్రాల దొంగగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటులు నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి కూడా ఓ కీలకపాత్రలో నటించనున్నట్లు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఇందులో ఎంత నిజమో మేకర్స్ ప్రకటించాల్సి ఉంది..

Hindi is no more a national language: Kiccha Sudeep

actress alekhya stills in tight red t-shirt!