in

Pooja Hegde ready to romance Vijay Devarakonda!

పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో జనగణమన అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ముంబయిలో ఈ సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. హెలికాప్టర్ లో విజయ్ దేవరకొండ దిగడం, మిలట్రీ దుస్తుల్లో కనిపించడం.. ఇలా సెటప్ మొత్తం సెట్ చేసి ఓపెనింగ్ చేశారు. ఇప్పుడీ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకొచ్చాయి..జనగణమన సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకున్నారు. ఈ మేరకు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. పూజా హెగ్డే కూడా కాల్షీట్లు కేటాయించింది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే జూన్ నెలాఖరు నుంచి లేదా జులై మొదటి వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. విజయ్ దేవరకొండ, పూజా కాంబినేషన్ లోనే ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశాడు పూరి జగన్నాధ్. పూరి జగన్నాధ్ కలల ప్రాజెక్టు ఇది. ఎప్పుడో ఈ స్టోరీ రాసుకున్నాడు. మహేష్ బాబుతో చేద్దామని ట్రై చేశాడు. కానీ మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో ఎట్టకేలకు విజయ్ దేవరకొండ హీరోగా ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేశాడు పూరి. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుతో ఎలాగైనా హిట్ కొట్టి, తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు..

Ileana During The Media Interactions for ‘Raid’!

hot sensation Dimple Hayathi to shake legs with balayya!