in

hot sensation Dimple Hayathi to shake legs with balayya!

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభిన‌యం చేస్తున్నార‌నే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉందని, దానిలో హాట్ బ్యూటీ డింపుల్ హయతి బాలయ్యతో కలిసి స్టెప్పులు వేయనున్నట్టుగా తెలుస్తోంది.

ఈ ఐటెం సాంగ్ కోసం డింపుల్ హయతి కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఐతే దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇక శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. జైబాలయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అఖండ లాంటి భారీ హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీస్థాయిలోనే ఉన్నాయి.

Pooja Hegde ready to romance Vijay Devarakonda!

Catherine Tresa posing in Black Jacket and Blue Jeans!