in

pooja hegde in pawan harish film!

క లైలా కోసం, ముకుంద లాంటి మీడియం రేంజి సినిమాలు చేసి బాలీవుడ్‌కు వెళ్లిపోయిన పూజాను ఏరి కోరి ఎంచుకుని ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి భారీ చిత్రంలో అల్లు అర్జున్ సరసన కథానాయికను చేసి తన కెరీర్‌ను మలుపు తిప్పింది హరీషే. ఆ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా పూజ కెరీర్‌కు మాత్రం ఢోకా లేకపోయింది. వరుసగా పెద్ద స్టార్ల సరసన భారీ చిత్రాలతో దూసుకెళ్లింది. ఇప్పుడు టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ పూజానే అనే విషయంలో మరో మాట లేదు.

ఆల్రెడీ మహేష్ బాబు లాంటి టాప్ స్టార్‌తో నటించిన పూజా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన అవకాశం అందుకున్నట్లు సమాచారం. ఆమెను పవన్ పక్కన నటింపజేస్తున్నది హరీషే కావడం విశేషం. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’తో పాటు క్రిష్ సినిమా చేస్తున్న పవన్.. దీని తర్వాత హరీష్ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే.

nagnam beauty about her relation with jagapathi babu!

nani to produce a web series soon!