in

Pooja Hegde Hikes Remuneration With T&C!

త‌గ్గేదే లే..ఈ డైలాగ్ ఎక్క‌డో విన్న‌ట్టుందే అనిపిస్తుంది క‌దా..ఎక్క‌డో కాదు అల్లు అర్జున్ న‌టిస్తోన్న పుష్ప చిత్రంలోని ఫేమ‌స్ డైలాగ్ ఇది. సినిమా రిలీజ్ కు ముందే ఈ డైలాగ్ పాపుల‌ర్ అయిపోయింది. ఇపుడీ ఈ డైలాగ్ ను నొక్కి మ‌రీ చెప్తోంది పూజాహెగ్డే. ఈ బ్యూటీ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఈ అమ్మ‌డిని త‌మ సినిమాలోకి తీసుకోవాల‌ని చాలా మంది ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క్యూ క‌ట్టారంటే అతిశ‌యోక్తి కాదు. ప్ర‌స్తుతం స్టార్ హీరోల సినిమాల‌తో బిజీగా ఉంది పూజాహెగ్డే.

ఈ భామ ఖాతాలో రాధేశ్యామ్‌, ఆచార్య‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్, బీస్ట్ చిత్రాలున్నాయి. త‌న‌కున్న పాపులారిటీ దృష్ట్యా రెమ్యున‌రేష‌న్ విష‌యంలో కాంప్రమైజ్ అవ‌కూడ‌ద‌ని ఫిక్స్ అయింద‌ట ఈ పొడుగుకాళ్ల సుంద‌రి. పారితోషికంలో కొంత కూడా త‌గ్గించేంద‌కు స‌సేమిరా అంటోంద‌ట‌. టాప్ తెలుగు నిర్మాణ సంస్థ పూజాహెగ్డేను రెమ్యున‌రేష‌న్ కొంత త‌గ్గించుకోవాల‌ని కోరగా..పూజా మాత్రం ఆ విష‌యంలో మాత్రం త‌గ్గేదే లే అని తెగేసి చెప్పిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్‌లో జోరుగా టాక్ వినిపిస్తోంది.

disha patani raises heat!

Kajal Aggarwal – A RAW Agent!