in

police found sushanth’s dairy!

యువ కథానాయకుడు​ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ జూన్‌ 14న బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మానసిక ఒత్తిడి వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. కానీ సుశాంత్‌ నివాసంలో ఎటువంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదు. దీంతో పోలీసులు ఇది ఆత్మహత్యా.. లేకపోతే దీని వెనక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్‌ సన్నిహితులతోపాటుగా అతడి గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి, దర్శకుడు ముఖేష్ చబ్రా నుంచి కూడా పోలీసులు విచారించారు. తాజాగా ముంబై పోలీసులు సుశాంత్‌ నివాసం నుంచి ఐదు పర్సనల్‌ డైరీలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది.

ఈ డైరీలను నిపుణుల సమక్షంలో పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు.దీంతో అతని జీవితంలో ఏం జరిగిందనే దానిపై కొంతమేర స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. అలాగే ప్రస్తుతం అమ్మపై సుశాంత్ రాసిన కవిత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ” అమ్మా నీకు గుర్తుందా.. ఎప్పటికి నాతోనే ఉంటానని నువ్వు నాకు వాగ్దానం చేశావు. అలానే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నవ్వుతూనే ఉంటానని నేను నీకు మాట ఇచ్చాను. చూడబోతే మన ఇద్దరం తప్పని తెలుస్తుంది అమ్మా” అంటూ రాసుకొచ్చారు.

kajal for chiru, kiara for charan!

ismart beauty nidhi agarwal!