ప్రముఖ సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఆచార్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి విదితమే. తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగ వ్యవహరిస్తున్నాడు. ఇందులో ముందుగా త్రిషను హీరోయిన్ గా అనుకోగ కొన్ని కారణాలతో ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది..
ఆమె స్థానంలో లేటు వయస్సు అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసింది చిత్రం యూనిట్. అయితే ఈ సినిమాలో చిరుతో పాటు రామ్ చరణ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. రామ్ చరణ్ కు తోడుగా బాలీవుడ్ భామ కియారా అద్వాణీని తీసుకున్నట్లు సమాచారం. అయితే గతంలో కాజల్ అగర్వాల్ చిరుతో రీఎంట్రీ మూవీ ఖైదీ నెం 150లో నటించింది. మరో వైపు కియారా అద్వాణీ వినయ విధేయ రామ సినిమాలో చరణ్ తో ఆడిపాడింది..