in

‘Pokiri’ to soon available in theatres in 4k Ultra HD!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ లో ఠక్కున రెండు పేర్లు చెప్పమంటే అభిమానులకు గుర్తొచ్చేవి ముందు పోకిరి ఆ తర్వాత ఒక్కడు. ఇప్పుడంటే మహీని కొంచెం సాఫ్ట్ టచ్ తో చూస్తున్నాం కానీ ఒకప్పుడు మాస్ కి వెర్రెక్కేలా గూస్ బంప్స్ ఇచ్చిన బ్లాక్ బస్టర్స్ ఇవి. యుట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. టీవీ ఛానల్స్ లో క్రమం తప్పకుండా వస్తుంటాయి. కానీ వీటిని థియేటర్ లో మిస్ అయిన ఇప్పటి జెనరేషన్ ఫ్యాన్స్ ఆ టైంలో వీటి యుఫొరియాని మిస్ అయ్యామని ఫీలవుతూనే ఉంటారు.

అలాంటివాళ్ల కోరిక తీర్చేందుకు పోకిరిని 4K రిజొల్యూషన్ లోకి రీ మాస్టర్ చేసి డాల్బీ ఆడియోతో థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఆగస్ట్ 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రధాన కేంద్రాల్లో భారీ ఎత్తున ప్రీమియర్లు వేసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఈ మేరకు వీటి తాలూకు పనులు కూడా ఒక కొలిక్కి వచ్చాయి.ఈ మధ్య వేరే సినిమాలకు ఇలాంటి షోలు వేశారు కానీ అవి కేవలం హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలకే పరిమితమయ్యాయి. కానీ పోకిరికి మాత్రం డిఫరెంట్ స్ట్రాటజీ ప్లాన్ చేయబోతున్నారు.

మొత్తానికి ఇది ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే వార్తే. ఇంతకు ముందు బిజినెస్ మెన్, శ్రీమంతుడు లాంటివి రీ రిలీజ్ చేస్తేనే ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఇక పోకిరి చేయబోయే రచ్చ గురించి వేరే చెప్పాలా. టికెట్ రేట్లు కేవలం ముప్పై నలభై రూపాయలు ఉన్న టైంలో ఆల్ టైం రికార్డులు సృష్టించిన ఈ మాస్ క్లాసిక్ ని బిగ్ స్క్రీన్ మీద చూస్తే వచ్చే కిక్కే వేరు. ముఖ్యంగా పండుగాడి డైలాగులు, విజిల్స్ వేయించే పాటలు, మణిశర్మ టెర్రిఫిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయికదా. సిద్ధమవ్వండి మరి..

Samantha becomes silent on social media, fans raise concerns!

N.T.R. INTILO GODA YEKKINA NARAYANA REDDY ARTICLE!