in

Please leave my daughter, Keerthy Suresh’s father on rumors!

హానటి కీర్తి సురేష్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతోందని యూట్యూబ్ చానెళ్లు వార్తలను వండి వడ్డిస్తున్నాయి. తాజాగా ఆమె తన స్నేహితుడితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఇతడే ఆమె చేసుకోబోయే వరుడు అంటూ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. పలు సైట్లు రకరకాలుగా వార్తలు రాస్తున్నాయి. ఇప్పటికే ఈ వార్తలను కీర్తి సురేష్ ఖండించింది. ఆ వార్తలన్నీ అవాస్తవాలని తేల్చి చెప్పింది. అయినా, ఈ వార్తలకు అడ్డుకట్ట పడటం లేదు.

ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ తండ్రి తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. కీర్తి గురించి వస్తున్న వాస్తలన్నీ అవాస్తవాలని ప్రకటించారు. ఈ వార్తల కారణంగా తమ మనఃశాంతి కరువవుతోందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ఇటీవల కీర్తి సురేష్ తన స్నేహితుడితో దిగిన ఫొటోపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆ అబ్బాయి కీర్తికి మాత్రమే కాదు, మా కుటుంబ సభ్యులు అందరికీ తెలుసు. అతడి పేరు  ఫర్హాన్. ఇటీవల తన బర్త్ డే జరిగింది. ఈ సందర్భంగా కీర్తి ఓ ఫోటో షేర్ చేస్తూ అతడికి బర్త్ డే విషెస్ చెప్పింది. ఈ ఫోటోను బేస్ చేసుకుని ఓ తమిళ మీడియా సంస్థ బేస్ లెస్ వార్త ప్రసారం చేసింది..!!

Ram Charan to step forward into production for Akhil Akkineni

Sreeleela Replaced Samantha In an international movie?