in

‘pelli sandadi’ girl Sreeleela to make bollywood debut soon!

మధ్య హీరోయిన్లకు ఎక్కువగా ఫేమ్ రావాలంటే చాలా సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదు. చేసింది ఒక్క సినిమానే అయినా.. దాని ద్వారా ఎక్కువమంది ప్రేక్షకుల దృష్టిలో పడితే చాలు. ప్రస్తుతం తెలుగులో అలా చాలామంది హీరోయిన్లు తక్కువ సినిమాలతోనే తమ హవా చూపిస్తున్నారు. అందులో ఒకరు శ్రీలీల. ఇక టాలీవుడ్‌లో సత్తా చాటుతున్న ఈ బ్యూటీ.. త్వరలోనే బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వనుందట. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఏ నటిని అయినా.. అతిలోక సుందరిగానే చూపిస్తారు. అలాంటి ఆయన సినిమాతోనే డెబ్యూ చేస్తే.. ఇంకా ఆ నటిపై టాలీవుడ్‌లో ఫోకస్ ఎక్కువవుతుంది.

అలాగే శ్రీలీలపై కూడా ప్రేక్షకులు మాత్రమే కాదు.. మేకర్స్ కూడా దృష్టిపెట్టారు. అందుకే తన మొదటి సినిమా ‘పెళ్లిసందడి’ విడుదలవ్వగానే శ్రీలీల చేతిలోకి నాలుగు తెలుగు సినిమా ఆఫర్లు వచ్చిపడ్డాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లోనే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ కన్నడ బ్యూటీకి బాలీవుడ్ నుండి కూడా పిలువు వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రష్మిక, పూజాలాంటి హీరోయన్లు ఇటు తెలుగుతో పాటు అటు హిందీ సినిమా ఆఫర్లు కూడా సమానంగా అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక శ్రీలీల కూడా త్వరలోనే ఆ జాబితో చేరేలాగా కనిపిస్తోంది..

shruthi haasan ended the flop streak of these star heroes!

serial actress Chethana Raj passes away after plastic surgery!