in

payal rajput turns villain for ‘3 roses’!

యూత్ లో పాయల్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. వెండితెరకి భారీ అందాలను పరిచయం చేసిన కథానాయికలలో ‘పాయల్ రాజ్ పుత్’ ఒకరు. ఈ సొగసరి మంచి పొడగరి  అది ఆమెకి ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది. మోడరన్ డ్రెస్ లో అయినా .. చీరకట్టులో అయినా ఈ సుందరి కుర్రాళ్ల మతులు పోగొడుతూ ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో రాణించాలంటే లక్కూ,లౌక్యం రెండూ కావాలి. లేదంటే కాస్త వెనకబడక తప్పుదు. ఈ పిల్ల విషయంలో అదే జరిగింది.

తెలుగులో పాయల్ ఆశించినస్థాయిలో అవకాశాలను అందుకోలేకపోతోంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల్లో ఎంట్రీ కొట్టలేకపోతోంది. ఇదే ఇప్పుడు ఆమె అభిమానులను బాధపెడుతున్న విషయం. సినిమాల సంగతి అటుంచితే తాజాగా ఆమె ఒక వెబ్ సిరీస్ ను అంగీకరించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ వారు ‘త్రీ రోజెస్’ అనే వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ఇందులో ఆమె నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో చేస్తోందట. ఆమె విలనిజమే ఈ సిరీస్ కి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

‘bangaram’ beauty sensational comments on her sister Priyanka chopra!

Bellamkonda Sreenivas to star in the Telugu remake of ‘Karnan’!