ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా సెకండ్ వేవ్ ఆరంభమయ్యాక ఇండియాలో వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా ముందు ఏ స్థాయి వ్యక్తులైన తలవంచక తప్పట్లేదు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఎక్కువ సంఖ్యలోనే మృత్యువాత పడ్డారు. కాగా తాజాగా పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతమయ్యారు.
తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంతగానో ప్రేమించే అనితా ఆంటీ కరోనాతో చనిపోయినట్లుగా తెలిపింది. ఇకపై మీరు నా పక్కన ఉండకపోవచ్చు. కానీ నా హృదయంలో ఎప్పటికీ ఉంటారు. అనితా ఆంటీ చివరిగా చెప్పిన మాట.. ‘నాకు ఊపిరాడడం లేదు.’ కరోనా.. అవకాశం ఉంటే నిన్ను అంతం చేసేస్తా.. అని పాయల్ పేర్కొంది.