
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ప[/qodef_dropcaps] వర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే. మొదట్లో చేయనని తన ఫోకస్ మొత్తం రాజకీయాల మీదే ఉందని ప్రకటనలు చేసిన పవన్ అంతకు ముందు అడ్వాన్స్ లు తీసుకున్న నిర్మాతల ఒత్తిడికి తలొగ్గక తప్పలేదని అంటున్నారు. రీ ఎంట్రీ అయితే కన్ఫర్మ్ అంటున్నారు కానీ సినిమా ఎవరితో ఉంటుందనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. అయితే క్రిష్ దర్శకత్వంలో సినిమాతో పవన్ తన రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని అంటున్నారు. ఇక ఆ సినిమా ఓపెనింగ్ కూడా వచ్చే నెల 15న జరగనుందని అంటున్నారు. అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ లో జానపద జోనర్ లో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇప్పటివరకూ పవన్ జానపద జోనర్ చేయలేదు. కాబట్టి ఇది చాలా కొత్త ప్రయత్నమనే అంటున్నారు.