in

Pawan Kalyan’s Heroine Insults Chiranjeevi intentionally?

ప్రభాస్ తనకు ఫ్రెండ్ అని, తనకంటే చాలా పొడుగ్గా ఉన్నాడంటూ తెలిపింది. ఇక మహేష్ బాబు గురించి ఒక్క మాటలో చెప్పమని అనగా.. ఫెయిర్ అండ్ లవ్లీ అని చెప్పేసింది. పవన్ కళ్యాణ్ బియర్డ్ లుక్ అదిరిపోయిందని ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది. ఇంతలో మీకు మెగాస్టార్ అంటే ఇష్టమా.. మెగాస్టార్ గురించి చెప్పండి అంటూ అడిగారు నెటిజన్స్. అప్పుడే ఈ అమ్మడు ఫ్యాన్స్ కి కాలెలా కామెంట్స్ చేసింది.

మెగాస్టారా.. ఏ మెగాస్టార్ గురించి చెప్పాలి.. చాలా మంది మెగాస్టార్లు ఉన్నారు కదా అని జోకులు వేసింది. ఎదో పరధ్యానంలో అనిందో లేక కావాలనే పరువు తీయాలని ఇలాంటి కామెంట్స్ చేసిందో ఎవ్వరికి అర్థంకాని పరిస్థితి. ఆమె అసలు మాట్లాడేది తెలుగు ఆడియన్స్ తో.. అది కూడా టాలీవుడ్ హీరోల గురించి. అలాంటప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గురించే ప్రశ్నలు వస్తాయి. అంతమాత్రం తెలీకుండా ఏ మెగాస్టార్ అని అనడంపై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

తెలుగులో వన్ ఓన్లీ మెగాస్టార్ ఉన్నాడు. అది మా అన్నయ్య చిరంజీవినే అంటూ నెటిజన్స్ నికీషా పటేల్ కి కౌంటర్స్ ఇస్తున్నారు. ఇక ఆమె వేసిన పాత ట్వీట్లను కూడా బయటకు తీసి.. ఖైదీ నంబర్ 150 సినిమా రిలీజ్ సమయంలో మెగాస్టార్ అంటూ నికీషా వేసిన ట్వీట్‌ను చూపిస్తున్నారు. నాడు నువ్వే ట్వీట్ వేశావ్.. నీకు ఏ మెగాస్టారో తెలియదా? అంటూ నికీషా పటేల్‌ను ఆడేసుకుంటున్నారు. ఇందుకే నీకు ఆఫర్లు రావడం లేదంటూ కౌంటర్లు వేస్తున్నారు ఫ్యాన్స్.

‘Ashoka Vanamlo Arjuna Kalyanam ‘Trailer, Vishwak Sen, Rukshar Dhillon!

After Jr NTR, director Koratala speaks about NTR30!