in

Power Star Pawan Kalyan Celebrates 54th Birthday With Love Ones!

పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్
వర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఈ పేరులోనే ఏదో కిక్కు ఉంటుంది. తన సినిమాలకి బాక్సాఫీస్ దగ్గర ఓ లెక్కుంటుంది. ముక్కుసూటితనం, అడ్డంకుల్ని లెక్కచేయనిగుణం, సహనం సేవానిరతి, సమాజంపట్ల అక్కర ఆయనని అభిమానించే వారికి ఎనలేని ధైర్యాన్ని అందిస్తుంది. నటుడిగానే కాకుండా మానవతా వాదిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ నేడు 56 వ బర్త్ డే జరుపుకుంటున్నారు..డాక్టర్‌ని కాబోయి యాక్టర్‌ని అయ్యానని చాలా మంది అంటుంటారు. కాని పవన్ డాక్టర్ కావాలనుకోలేదు, యాక్టర్ కావాలనుకోలేదు. ఏదో సాదాసీదాగా జీవితాన్ని కొనసాగించాలని భావించాడు, కాని మెగాస్టార్ చిరంజీవి ప్రోద్భలంతో సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ బుల్లెట్‌లా దూసుకెళుతున్నాడు.

పవర్ స్టార్ టు డిప్యూటీ చీఫ్ మినిస్టర్
హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ఆయన నట ప్రస్థానం అప్రతిహతంగా సాగుతుంది. రాజకీయాల వలన రెండేళ్ళు గ్యాప్ తీసుకున్న పవన్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వగా, ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. నటుడు అంటే కొంత వరకే అభిమానం ఉంటుంది. కాని అభిమానులు ఆయనని దేవుడి కన్నా ఎక్కువగా కొలవడాన్ని చూసి అందరు ఆశ్చర్యపోతుంటారు. కేవలం 27 సినిమాలతోనే ఇంత ఫ్యాన్ ఫ్యాలోయింగ్ ఏర్పరచుకున్న పవన్ మానవ సేవే మాధవ సేవ అనే సిద్దాంతాన్ని ఎక్కువగా నమ్ముతారు.నటుడిగా, జనసేన అధినేతగా ముందుకు సాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము..HAPPY BIRTHDAY DEPUTY CM GAARU!!

OG USA Box Office Creates History In Premiere Pre-Sales!

Teja sajja Clarifies about Mahesh Babu’s Lord Rama role!