in

pawan confirmed chiru and mehar ramesh movie!

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కథానాయకునిగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ టీజర్ మరింత ఆసక్తిని రేపాయి. అయితే చిరు ఈ చిత్రం తర్వాత రెండు రీమేక్స్ లో నటించనున్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో దర్శకుడు వివి వినాయక్ తో “లూసిఫర్” రీమేక్ చేస్తున్న విషయం ఎప్పటి నుంచో ఖరారు అయ్యింది. దీనితో పాటుగా తమిళ్ వేదాళం రీమేక్ లో కూడా చిరు కనిపించనున్నారని ఈ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించనున్నారని టాక్ వినిపించింది. కానీ ఇపుడు ఆ మెగా మరియు మెహర్ ల ప్రాజెక్ట్ ను చిరు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కన్ఫామ్ చేసేసారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెహర్ రమేష్ కు రిప్లై ఇస్తూ ఈ విషయాన్ని పవన్ తెలిపారు. దీనితో ఈ చిత్రం పై కూడా ఒక క్లారిటీ వచ్చేసింది అని చెప్పాలి.

this is the occasion when samantha cried!

madhavi latha becoming tollywood kangana!