17 years for ‘dhee’!
ఎవరైనా ఇద్దరు ఓ విషయంలో వాదించుకుంటూ, పక్కనే ఉన్నవారిని “మీరైనా చెప్పండి..” అని అడిగితే, అందులో తలదూర్చడం ఇష్టం లేనివారు- “ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి..” అనడం సహజం. అవే మాటలను బ్రహ్మానందం నోట పలికించి, ఆ మాటలకు విశేషమైన ప్రాచుర్యం కలిగించిన చిత్రం ‘ఢీ’. ఈ సినిమా చూసినవారెవరైనా అందులో చారి పాత్రధారి బ్రహ్మానందం పలు మార్లు ఈ పదాలు పలికి, చేసిన కామెడీని మరచిపోలేరు. ఇప్పటికీ కొందరు సమయోచితంగా “ఇందులో మమ్మల్ని ఇన్ వాల్వ్ [...]