మూవీ మొఘుల్ రామ నాయుడు, తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆయనదో శకం. నిర్మాత గ అలుపెరుగని, ప్రయాణం. రామ నాయుడు గారు ఒంగోలు లో ఒక హాస్పిటల్ లో కాంపౌండర్ గ పని చేసారు. ఆయన కంపౌండర్ గ పని చేసింది సంపాదన కోసం కాదు, ప్రకాశం జిల్లా లోని, కారంచేడు గ్రామం లో సంపన్న కుటుంబం లో పుట్టిన ఏకైక కుమారుడు. ఉమ్మడి కుటుంబం లో ఒక్కడే మగ పిల్ల వాడు కావటం తో గారాబంగా పెరిగారు,
కాస్త లోక జ్ఞానం నేర్చుకుంటాడు అనే ఉద్దేశం తో వాళ్ళ నాన్న గారు కొంత కాలం అక్కడ పని చేయటానికి చేర్పించారట..ఒంగోలు పట్టణం లో అప్పట్లో ప్రముఖ వైద్యుడు డాక్టర్ బి. వి.ఎల్. నారాయణ గారి హాస్పిటల్ లో కంపౌండర్ గ కొంత కాలం పని చేసారు, ఆ తరువాత పై చదువుల కోసం అప్పటి మద్రాసు లయోలా కాలేజీ లో చేరారు. అప్పుడు కూడా ఆయన మద్రాసు కె వచ్చి నిర్మాత అవుతారని ఊహించని రామ నాయుడు గారు కాల క్రమం లో మద్రాసు కు తిరిగి వచ్చి నిర్మాత అయ్యారు..