in

big update : Special friendship song from ‘RRR’ to be out soon!

తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ఆడియో హక్కులను ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక రేటుకు టీ సిరీస్-లహరి వాళ్లకు అమ్మడం తెలిసిందే. సినిమా నుంచి ఇక ఒక్కో పాట రిలీజ్ చేయడానికి కూడా సన్నాహాలు జరుతున్నాయి. తొలి పాటకు ముహూర్తం కూడా కుదిరింది. ఆగస్టు 1న ఉదయం 11 గంటలకు ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయబోతున్నారు. ఈ పాట గురించి అప్‌డేట్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది ‘ఆర్ఆర్ఆర్’ టీం.

ఆ ఫొటోలో ‘ఆర్ఆర్ఆర్’ సంగీత దర్శకుడు కీరవాణితో పాటు తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, ప్రముఖ బాలీవుడ్ మ్యుజీషియన్ అమిత్ త్రివేదిలతో పాటు గాయకులు హేమచంద్ర, విజయ్ ఏసుదాస్, యాజిన్ నజీర్ ఉన్నారు..ముగ్గురు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు, ముగ్గురు మంచి గాయకులు కలిసి ఈ పాట కోసం పని చేశారంటే ఇది మామూలుగా ఉండదనే అంచనాలు కలుగుతున్నాయి.

మరి కొన్ని రోజులుగా చర్చనీయాంశం అవుతున్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ సాంగే ఇదా.. లేక వేరే పాటనా అన్నది తెలియాల్సి ఉంది. ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించి ఇప్పటిదాకా రిలీజ్ చేసే ప్రోమో వీడియోల్లో కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ వారెవా అనిపించింది. మరి పాటల్లో ఆయన పనితనం ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుత అంచనాల ప్రకారం అయితే ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబరు 13న విడుదలయ్యే అవకాశముంది..

regina, nivetha as ‘Shakini Dhakini’, Telugu remake of ‘Midnight Runners’!

ONGOLE LO COMPOUNDER GA PANI CHESINA MOVIE MOGHUL!