మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ 31 వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ మొదలు కాబోతోంది. దీనికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ పేర్కొన్నారు. హీరోయిన్ గా రష్మిక ఫైనల్ అయినట్లు కూడా టాక్. ఇప్పుడు ఈ మూవీ కి సంభందించి ఇంకొక న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. సుమారు 130 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ తీసుకున్న పేమెంట్ కి ఇది చాలా ఎక్కువని పలువురు కామెంట్స్ పెడుతున్నారు. RRR తరవాత ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారటం, వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేయటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఎన్టీఆర్ మార్కెట్ కూడా బాగా పెరిగింది. దీనికి అనుగుణంగానే ఎన్టీఆర్ పారితోషికం పెంచినట్లు తెలుస్తోంది..!!