
కొన్ని సంఘటనలు యాదృచ్చికంగా జరుగుతాయా లేక, ఉద్దేశ్యపూర్వకంగా జరుగుతాయో చెప్పలేము అటువంటి సంఘటన ఒకటి మాస్ట్రో ఇళయరాజా మరియు గాన కోకిల పి.సుశీల గారి మధ్య జరిగింది.ఇళయ రాజా గారి సంగీత దర్శకత్వం లో సుశీల గారు ఒక్క పాట కూడా పాడ లేదు, చాల ఆశ్చర్యంగా ఉంది కదూ, అవునండి ఇది నిజం. సంగీత దర్శకుడు కాకా ముందు ఇళయరాజా గారు చాలామంది వద్ద ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్ గ పని చేసారు. అయన రాజన్ నాగేంద్ర గారి ట్రూప్ లో గిటారిస్ట్ గ పని చేస్తున్నపుడు ఒక పాట రికార్డింగ్ సందర్భం లో, సుశీల గారు మాటి,మాటి, కి శృతి తప్పుతున్నారట, రాజన్ నాగేంద్ర గారు ఏమయిందమ్మా అని అడిగితే, ఆ గిటారిస్ట్ నోట్ సరిగా వాయించటం లేదు అని చెప్పారట. ఇళయరాజా గారు తన తప్పేమి లేదని చెప్పే ప్రయత్నం చేసిన ఎవరు పట్టించుకోలేదట, సహజం గానే సున్నిత మనస్కుడయినా రాజా గారిని ఆ విషయం చాల బాధించింది.ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ఇళయరాజా కూడా సంగీత దర్శకుడు అయ్యారు,జానకి గారు, వాణి జయరాం గారు, చిత్ర గారు ఇలా అందరు అయన దర్శకత్వం లో పాటలు పాడారు ఒక్క సుశీల గారు తప్ప.సుశీల గారి తో పాట పాడించటానికి రాజా గారికి ఆ పాత సంఘటన గుర్తు వచ్చేదో, లేక గిటార్ నోట్ సరిగా వాయించటం రాని తాను ఆమెతో పాడించటం ఎందుకు అనుకున్నారో గానీ ప్రేక్షకులు మాత్రం ఒక గొప్ప కాంబినేషన్ మాత్రం మిస్ అయ్యారు అని చెప్పవచ్చు.

